శ్రీవారి సుప్రభాతసేవలో రజనీ.. ఐశ్వర్య

By udayam on December 15th / 6:38 am IST

సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ రోజు తెల్లవారు ఝామున తిరుమల ను దర్శించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్ధం కూతురు ఐశ్వర్య తో కలిసి రజినీకాంత్ తిరుపతి వచ్చారు. శ్రీ వారి సుప్రభాత సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసారు. తదుపరి వేద పండితుల ఆశీర్వచనం పొంది , తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు. రజినీకాంత్ శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల కొండకు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.కూతురు ఐశ్వర్య డైరెక్షన్లో సూపర్ స్టార్ ‘లాల్ సలాం’ అనే సినిమాలో ఒక స్పెషల్ రోల్ లో నటించబోతున్నారు.

ట్యాగ్స్​