టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్.. ఇప్పుడు ఎక్కడ చూసినా గతంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రాలు తిరిగి రీ రిలీజ్ లు జరుపుకుంటూ సందడి చేస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి రజనీకాంత్ గత చిత్రం బాబా చేరింది. 2002 ఆగస్ట్ 15న వచ్చిన ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని మూటగట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ మూవీని డిజిటల్ గా 4కె లోకి మార్చి వచ్చే నెల 12 నుంచి తమిళనాడులోని కొన్ని ధియేటర్లలో ఫ్యాన్స్ కోసం ప్రదర్శించనున్నారు. ఆరోజు రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా భారీ కలెక్షన్లు రావడం పక్కాగా తెలుస్తోంది.