సుప్రీం: షాహీన్​ బాగ్​ కూల్చివేతలపై స్టే ఇవ్వం

By udayam on May 9th / 11:44 am IST

ఢిల్లీలోని షాహీన్​ బాగ్​ ఆక్రమణల కూల్చివేతపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్ట్​ నిరాకరించింది. ఈ విషయంపై దాఖలైన అత్యవసర పిటిషన్​ను తిరస్కరించిన కోర్టు.. కూల్చివేతలపై తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టులోనే దీనిపై తేల్చుకోవాలని పిటిషనర్లకు సూచించిన సుప్రీం.. బాధితులు వేయాల్సిన పిటిషన్​ను రాజకీయ పార్టీలు ఎందుకు వేస్తున్నాయని ప్రశ్నించింది. మీ మీ రాజకీయాలకు సుప్రీంలాంటి అత్యున్నత న్యాయస్థానాలను వేదికగా చేసుకోవద్దని పేర్కొంది.

ట్యాగ్స్​