17 ఏళ్ళ తర్వాత ‘గోద్రా’ దోషికి బెయిల్​

By udayam on December 16th / 4:51 am IST

గోద్రా రైలు దగ్ధంకు సంబంధించిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఫారుక్‌కు సుప్రీంకోర్టు గురువారం బెయిల్‌ మంజూరు చేసింది. ఆ వ్యక్తి 17 ఏళ్ల పాటు జైల్లోనే ఉన్న కారణంగా బెయిల్‌ ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో మిగిలిన మరికొంత మంది దోషులు కూడా బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోగా.. ఆ పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 2002, ఫిబ్రవరి 27న గోద్రా రైల్వేస్టేషన్‌లో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు నిప్పంటించడంతో ఎస్‌-6 బోగీలోని 59 మంది ప్రాణాలు కోల్పోయారు.

ట్యాగ్స్​