సుప్రీం: జర్నలిస్టులను తిట్టినా, బెదిరించినా.. కఠిన శిక్షలు

By udayam on November 25th / 11:10 am IST

దేశంలోని వర్కింగ్‌ జర్నలిస్టులు, పాత్రికేయులను బెదిరించినా, తిట్టినా లేదా కొట్టినా రూ.50 వేల జరిమానా లేదా ఐదేళ్లు కఠిన కారాగార శిక్షకు అర్హులవుతారని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ మేరకు గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా … అత్యున్నత న్యాయస్ధానం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. సుప్రీం తీర్పుపై పలు జర్నలిస్టు సంఘాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. వృత్తిపరంగా ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా నిర్భయంగా ప్రజలకు వాస్తవ సమాచారం అందించే అవకాశం ఉంటుందని పలువురు జర్నలిస్టు సంఘాల నేతలు, సీనియర్‌ జర్నలిస్టులు తీర్పును ఆహ్వానించారు.

ట్యాగ్స్​