దేశ ద్రోహ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చట్టంపై పున:సమీక్ష జరుగుతున్నందున ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకూ దేశ ద్రోహ చట్టం కింద ఎలాంటి కేసులు నమోదు చేయొద్దని ఆదేశించింది. అదే సమయంలో దీనిపై ఎలాంటి విచారణను ప్రారంభించడం లేదని సైతం వెల్లడించింది. ఈ చట్టం కింద ఇప్పటికే అరెస్ట్ అయి విచారణ ఎదుర్కొంటున్న వారు, జైలులో ఉన్న వారు బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయించవచ్చని సిజేఐ ఎన్వీ రమణ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.