తామిచ్చిన ఆదేశాలను అర్థం చేసుకోలేకపోయిన ఆంధ్రప్రదేశ్ నెల్లూరు అదనపు సెషన్ జడ్జిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నెల్లూరు సెంట్రల్ జైలులో గృహ హింస, హత్య కేసులో దోషిగా తేలి 9 ఏళ్ళుగా శిక్ష అనుభవిస్తున్న గోపిశెట్టి హరికృష్ణని 3 రోజుల్లో ట్రయల్ కోర్టులో ప్రవేశపెట్టాలని, బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టు 2020 సెప్టెంబర్ 28న ఆదేశించింది. తామిచ్చిన ఆదేశాలను ఇప్పటికీ అమలు చేయని ఆ జడ్జికి జ్యుడీషియల్ అకాడమీ శిక్షణ సరిగా లేదా అని మండిపడింది.