రాజీవ్‌గాంధీ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎజి పెరరివాలన్‌ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. గత 30 ఏళ్ళుగా జైలు శిక్ష అనుభవిస్తున్న అతడిని విడుదల చేయాలని జస్టిస్‌లు ఎల్.నాగేశ్వరరావు, బిఆర్.గవాయి, ఎఎస్.బోపన్నలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీర్పుచెప్పింది. ఆర్టికల్ 142, ఆర్టికల్ 161ల కింద వీరి విడుదలపై తమిళనాడు గవర్నర్ జాప్యం చేయరాదంది. పెరరివాలన్ విడుదలైతే ఇదే కేసులో శిక్ష పడ్డ నళిని, మురుగన్లూ విడుదలకు మార్గం సుగమం అవుతుంది.