దుస్తుల పైనుంచి ఆడవాళ్ళను తాకితే లైంగిక దాడి కాదన్న బోంబే హైకోర్టు తీర్పుపై ఈరోజు సుప్రీంకోర్టు స్టే విధించింది.
సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎ బాబ్డే అధ్యక్షత వహించిన సుప్రీం బెంచ్ ఈ మేరకు బొంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తున్నట్లు పేర్కొంటూ.. అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌కు అనుమతించింది.
అంతకు ముందు ఓ వ్యక్తి.. చైల్డ్ అబ్యూస్ కేసులో ముద్దాయిగా ఉన్న కేసులో బొంబో హైకోర్టు తీర్పు చెబుతూ.. దుస్తుల పై నుంచి ఆడవాళ్ళను తాకితే అది పోక్సో చట్టంలోని లైంగిక దాడి కిందకు రాదంటూ తీర్పు చెప్పింది.