27 నుంచి సుప్రీం విచారణల లైవ్​ స్ట్రీమింగ్​

By udayam on September 21st / 6:14 am IST

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. ఈనెల 27 నుంచి కీలక విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సిజెఐ జస్టిస్​ యు.యు.లలిత్​ ఆధ్వర్యంలో సమావేశమైన ధర్మాసనం పౌరసత్వ సవరణ చట్టం, ఆర్టికల్​ 370 వంటి కీలక కేసులకు సంబంధించిన విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు పేర్కొంది. కొద్దిరోజుల పాటు యూట్యూబ్​ లైవ్​స్ట్రీమింగ్​ ద్వారా వీటిని ప్రసారం చేసి ఆ తర్వాత సొంత ప్లాట్​ఫామ్​ను నిర్మించుకోవాలని సుప్రీం ధర్మాసనం భావిస్తోంది.

ట్యాగ్స్​