మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యాపార వేత్త రాకేష్ సురన కుటుంబం తమ యావదాస్తిని దేవుడికి దానం చేసి సన్యాసం తీసుకున్నారు. స్థానికంగా ప్రముఖ జ్యుయెలరీ వ్యాపారవేత్త అయిన ఆయన తన వద్ద ఉన్న రూ.11 కోట్ల ఆస్తిని, తమ లగ్జరీ జీవితాలను కాదనుకుని సన్యాసం పుచ్చుకున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన జైన్ల కార్యక్రమంలో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కుటుంబానికి బాలఘాట్ జిల్లాలో ఓ స్కూలుతో పాటు అతిపెద్ద నగల దుకాణం సైతం ఉంది.