రిపబ్లిక్​ డే అతిథిగా సరినామ్​ అధ్యక్షుడు

భారత సంతతి అధ్యక్షుడ్ని ఆహ్వానించిన ప్రధాని మోదీ

By udayam on January 12th / 7:13 am IST

ఈ ఏడాది జనవరి 26న ఢిల్లీలో జరిగే భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా రావాల్సి ఉన్న బ్రిటీష్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ పర్యటన రద్దు కావడంతో ఆయన స్థానంలో దక్షిణ అమెరికాలో అతి చిన్న దేశమైన సరినామ్​ అధ్యక్షుడు చంద్రిక ప్రసాద్​ సంతోఖి ముఖ్య అతిథిగా హాజరవ్వనున్నారు.

ఈ మేరకు రాజ్​పథ్​లో జనవరి 26న జరిగే పరేడ్​కు సంతోఖి హాజరై త్రివిధ దళాల విన్యాసాల్ని వీక్షించనున్నారు. గతవారం జరిగిన ప్రవాసి భారతీయ దివాస్​ కార్యక్రమానికి సైతం సంతోఖి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

వీసా లేకుండానే భారతీయులు రావొచ్చు : సంతోఖి

తనకు దక్కిన గౌరవానికి సంతోషం వ్యక్తం చేస్తూ సరినామ్​ దేశంలో పర్యటించాలనుకునే భారతీయులకు ఎలాంటి వీసా పర్మిట్లు అవసరం లేదని సంతోఖి ప్రకటించారు.