తమిళ అగ్రనటుడు సూర్య.. టాలెంటెడ్ డైరెక్టర్ బాల మూవీ నుంచి తప్పుకున్నాడు. ఇదివరకే ఈ మూవీ తెరకెక్కుతుందని ప్రచారం జరిగినా.. ఇప్పుడు ఈ మూవీ నుంచి సూర్య తప్పుకున్నాడని డైరెక్టర్ బాల.. ఫ్యాన్స్ కు ఓపెన్ లెటర్ ను రాసుకొచ్చాడు. ‘ఈ కథలో ఇప్పుడు చాలా మార్పులు చేశాం. ఈ కొత్త కథ సూర్య లాంటి వ్యక్తికి సరిపోదు. ఈ నిర్ణయం సూర్య కు బాధ కలిగించిందని తెలుసు. కానీ అతడికి పెద్దన్నయ్యలా ఆలోచించే ఈ మూవీ నుంచి సూర్య ను పక్కన పెడుతున్నాం. మూవీ రిలీజ్ తర్వాత అతడికి ఎదురయ్యే సమస్యలను ఇప్పుడే నిలువరించాలనే నేను ఈ నిర్ణయం తీసుకున్నా’ అంటూ డైరెక్టర్ బాలా చెప్పుకొచ్చాడు.