ఐసిసి ప్రతీ ఏటా ఇచ్చే టి20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు మహిళల గ్రూప్ లో భారత్ నుంచి స్మృతి మందాన కు, పురుషుల గ్రూప్ లో సూర్య కుమార్ యాదవ్ కు చోటు దక్కింది. సూర్యతో పాటు ఈ గ్రూప్ లో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ శామ్ కుర్రాన్, జింబాబ్వే ఆల్ రౌండర్ సికందర్ రాజాకు, పాకిస్థాన్ ప్లేయర్ రిజ్వాన్ లకు చోటు దక్కింది. మహిళల గ్రూపులో మందానతో పాటు పాకిస్థాన్ ప్లేయర్ నిదా దార్, ఆస్ట్రేలియా ప్లేయర్ తహ్లియా మెక్ గ్రాత్, న్యూజిలాండ్ ప్లేయర్ సోఫీ డివైన్ లకు చోటు దక్కింది.