టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తాజా టి20 ర్యాంకింగ్స్‌లోనూ టాప్‌లోనే కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌మండలి బుధవారం విడుదల చేసిన బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ 890 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇటీవల ముగిసిన టి20 ప్రపంచకప్‌లో 239పరుగులు చేసిన సూర్య… తాజాగా న్యూజిలాండ్‌తో ముగిసిన టి20 సిరీస్‌లోనూ చెలరేగాడు. ఆ సిరీస్‌లో అతను 124 పరుగులు చేశాడు. మౌంట్‌మౌంగనీలో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ సెంచరీ 111 (నాటౌట్) రాణించడంతో అతని ర్యాంక్ మరింత మెరుగైంది.