బ్యాటర్లు బాదేశారు.. సిరీస్​ను పట్టేశారు

By udayam on October 3rd / 4:58 am IST

భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో సౌతాఫ్రికాతో జరుగుతున్న టి20 సిరీస్​ను మరో మ్యాచ్​ మిగిలి ఉండగానే భారత్​ సొంతం చేసుకుంది. అస్సాంలోని బర్సాపర స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్​లో ముందుగా బ్యాటింగ్​ చేసిన భారత్​ రాహుల్​ 57, రోహిత్​ శర్మ 43, కోహ్లీ 49, సూర్యకుమార్​ 61 చేయడంతో 237 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆపై సౌతాఫ్రికాలో డికాక్​ 69, డేవిడ్​ మిల్లర్​ 106 పరుగులు చేసినా జట్టును గెలిపించలేకపోయారు. దీంతో తొలిసారిగా భారత్​లో సౌత్​ ఆఫ్రికాపై టి20 సిరీస్​ను మన జట్టు గెలుచుకుంది.

ట్యాగ్స్​