టి20 ర్యాంకింగ్స్​: మళ్ళీ మనోడికే పట్టం

By udayam on November 17th / 9:02 am IST

టి20 బ్యాటర్ల ర్యాంకింగ్స్​ లో మరోసారి 360 ప్లేయర్​ సూర్యకుమార్​ యాదవ్​ అగ్రస్థానం దక్కింది. గురువారం విడుదలైన ఈ ర్యాంకింగ్స్​ లో సూర్యకుమార్​ 859 పాయింట్లతో తొలి స్థానంలో ఉంటే.. మహమ్మద్​ రిజ్వాన్​ 836 పాయింట్లతో రెండు, 778 పాయింట్లతో బాబర్​ మూడో స్థానంలో ఉన్నారు. టి20 ఆల్​ రౌండర్ల జాబితాలో హార్ధిక్​ పాండ్య మూడో ర్యాంకు దక్కించుకోగా.. వన్డే బ్యాటర్ల జాబితాలో కోహ్లీ 772 పాయింట్లతో 7వ ర్యాంకులోనూ, రోహిత్​ శర్మ 718 పాయింట్లతో 8వ ర్యాంకులోనూ కొనసాగుతున్నారు.

ట్యాగ్స్​