ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. మొన్న కొల్కతాతో జరిగిన మ్యాచ్లోనూ లేని అతడు మోచేతి కండరం గాయంతో బాధపడుతున్నాడు. దీంతో ఐపిఎల్ ముగిసిన అనంతరం సౌత్ ఆఫ్రికాతో జరిగే 5 మ్యాచ్ల టి20 సిరీస్కు సైతం అతడు అందుబాటులో ఉండే అవకాశాలు తగ్గాయి. సూర్యకు అయిన గాయం తగ్గడానికి కనీసం 4 వారాల సమయం పడుతుందని తెలుస్తోంది. జూన్ 9 నుంచే సౌత్ ఆఫ్రికా సిరీస్ ప్రారంభం కానుంది.