సుశాంత్​ మృతిపై మళ్ళీ అనుమానాలు.. సంచలనం రేపుతున్న కూపర్​ ఆసుపత్రి సిబ్బంది ఇంటర్వ్యూ

By udayam on December 27th / 4:57 am IST

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి రెండేళ్ళు గడుస్తున్నా అతడి మరణంపై ఉన్న అనుమానాలు ఇప్పటికీ నివృత్తి కాలేదు. ఆయనది ఆత్మహత్యేనని గతంలో దర్యాప్తు సంస్థలు తేల్చినా ఫ్యాన్స్​ అతడిది హత్యేనని అనుమానిస్తున్నారు. తాజాగా సుశాంత్​ కు పోస్ట్​ మార్టం చేసిన కూపర్​ ఆసుపత్రిలోని ఓ సహాయకుడు రూప్​ కుమార్​ ఎఎన్​ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం సంచలనంగా మారింది. సుశాంత్​ శరీరంపై పలు చోట్ల గాయాలున్నాయని, మెడపైనా రెండు మూడు ఉన్నాయన్నారు. నిబంధనల ప్రకారం పోస్టుమార్టం చేస్తుండగా వీడియో తీయాల్సి ఉంటుందని అయితే, పైనుంచి వచ్చిన ఆదేశాలతో ఫొటోలు మాత్రమే తీశామని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్​