నేపాల్​ విమాన ప్రమాదం.. ప్రయాణికులంతా మృతి

By udayam on May 30th / 6:16 am IST

నేపాల్​లో నిన్న 22 మంది ప్రయాణికులతో గల్లంతైన విమానం కూలిపోయినట్లు ఆ దేశం ప్రకటించింది. విమానంలోని ప్రయాణికులందరూ సిబ్బందితో సహా మరణించినట్లు నేపాల్​ హోం శాఖ ప్రకటించింది. ఈరోజు విమానం కూలిన కొవాంగ్​ గ్రామానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది 14 మంది ప్రయాణికుల మృతదేహాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదంలో నలుగురు భారతీయులు సైతం దుర్మరణం చెందారు. 13 ఏళ్ళ సర్వీస్​ ఉన్న ఈ చిన్న విమానం గతంలో 3 సార్లు ప్రమాదానికి గురైందని ఆ దేశం ప్రకటించింది.

ట్యాగ్స్​