లూసిఫర్ రీమేక్ చేసే డైరెక్టర్​ ఎవరో?

By udayam on November 21st / 7:55 am IST

కొరటాల శివతో ‘ఆచార్య’ మూవీ తర్వాత లూసిఫర్‌ రీమేక్ చేయనున్న మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ ని మాత్రం ఇంకా కన్ఫర్మ్ చేయలేదు.

మొదట్లో సాహో డైరెక్టర్ సుజీత్ అప్పగించారు. ఎందుచేతనే మళ్ళీ, వి.వి. వినాయక్‌ పేరు వినిపించింది. తాజాగా హరీష్‌ శంకర్‌ పేరు కూడా తెరమీదికి వచ్చింది.

సాహో దర్శకుడు సుజీత్‌ దాదాపు కన్ఫర్మ్‌ అయి.. స్క్రిప్ట్ అంతా రెడీ అయ్యాక తప్పుకుంటే.. ఆ తర్వాత లైన్‌లోకి వచ్చిన వినాయక్‌.. కూడా తప్పుకున్నాడనే వార్తలు వచ్చాయి.

ఇక రీమేక్‌ చిత్రాలకు కమర్షియల్‌ హంగులు అద్దడంలో దిట్ట అయిన గబ్బర్‌సింగ్‌ దర్శకుడు హరీష్‌ శంకర్‌ చేతుల్లోకి ఈ చిత్రం వెళ్లబోతోందని అనుకున్నారు అయితే ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి మరో దర్శకుడు వచ్చారు. అతడెవరో కాదు, రామ్‌ చరణ్‌ ‘ధృవ’గా రీమేక్‌ చేసిన తమిళ ‘తనిఒరువన్‌’ దర్శకుడు మోహన్‌ రాజా. వాస్తవానికి మోహన్‌ రాజా కుటుంబానికి, చిరు కుటుంబానికి చాలా సత్సంబంధాలున్నాయి.

నిజానికి కొన్ని రోజులుగా రామ్‌ చరణ్‌ని మోహన్‌ రాజా డైరెక్ట్ చేయబోతోన్నట్లు టాలీవుడ్‌ ఇండస్ట్రీలో టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు చిరంజీవి లూసిఫర్‌ రీమేక్‌ని మోహన్‌ రాజా డైరెక్ట్ చేయబోతున్నాడని, ప్రస్తుతం ఆయన ఈ స్క్రిప్ట్​ చేంజ్‌ పనులు చేపట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే దీనిపై మెగాస్టారే క్లారిటీ ఇచ్చేవరకూ విషయం చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఇంతకీ లూసిఫెర్ ఎవరి చేతుల్లో పడనుందో.