గంటల వ్యవధిలో ప్రధాని రాజీనామా

By udayam on November 25th / 4:51 am IST

స్వీడన్​కు తొలి మహిళా ప్రధానిగా మంగళవారం ఎన్నికైన మగ్డలీనా ఆండర్సన్​ గంటల వ్యవధిలోనే బుధవారం నాడు ఆ పదవి నుంచి దిగిపోయారు. ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్​ పార్లమెంట్​లో ఆమోదం పొందలేకపోవడంతో ఆమె తన పదవికి రాజీనామా ఇచ్చేశారు. బడ్జెట్లో తాను ప్రవేశపెట్టిన పెన్షన్​ స్కీమ్​ నచ్చకే ఆమోదం పొందలేదని ఆమె ప్రకటించారు. 7 ఏళ్ళ పాటు స్వీడన్​కు ఆర్ధిక మంత్రిగా పనిచేసిన ఆమె ఆ దేశంలో ఏర్పడ్డ రాజకీయ అనిశ్చితి నేపధ్యంలో అనూహ్యంగా ప్రధాని అయ్యారు. కానీ ఎంతోసేపు ఆ పదవిని నిలబెట్టుకోలేకపోయారు.

ట్యాగ్స్​