జొమాటో, స్విగ్గీ : 31న టన్నుల కొద్దీ బిర్యానీల ఆర్డర్స్​

By udayam on January 2nd / 6:48 am IST

జొమాటో, స్విగ్గీలు డిసెంబర్ 31 న టన్నుల కొద్దీ బిర్యానీని డెలివరీ చేశాయి. న్యూ ఇయర్ ఈవ్‌ కావడంతో కస్టమర్ల నుంచి ఆర్డర్లు వెల్లువెత్తాయని ఈ ఫుడ్‌ డెలివరీ కంపెనీలు చెబుతున్నాయి. శనివారం రాత్రి 10.30 నాటికి దేశం మొత్తం మీద 3.50 లక్షల బిర్యానీ ఆర్డర్లను డెలివరీ చేశామని స్విగ్గీ ప్రకటించింది. 61,000 పిజ్జాలను, వేల కొద్ది నాచోలు, సోడాలను కస్టమర్లకు డెలివరీ చేశామని వివరించింది. తమ ప్లాట్‌ఫామ్‌కి వచ్చిన ఆర్డర్లు వాల్యూమ్స్‌ గతేడాది డిసెంబర్ 31 తో పోలిస్తే ఈసారి 45 % పెరిగాయని పేర్కొంది.

ట్యాగ్స్​