బిగ్​ బాష్​: 15 పరుగులకే ఆలౌట్​ అయిన సిడ్నీ థండర్​

By udayam on December 16th / 1:12 pm IST

ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్​ బాష్​ లీగ్​ లో అత్యల్ప స్కోరు నమోదైంది. అడెలైడ్​ స్ట్రైకర్స్​ జట్టుతో తలపడ్డ సిడ్నీ థండర్ కేవలం 15 పరుగులకే ఆలౌట్​ అయింది. అలెక్స్​ హేల్స్​, రిలీ రొస్సో, అలెక్స్​ రాస్​, డేనియల్​ సామ్స్​, క్రిస్​ గ్రీన్​, వంటి దిగ్గజాలు ఉన్న ఈ టీమ్​ ను ఆడిలైడ్​ బౌలర్​ హెర్నీ థార్న్​ టన్​ దెబ్బకొట్టాడు. కేవలం 2.5 ఓవర్లు వేసిన హెర్నీ 5 వికెట్లు తీసి 3 పరుగులు ఇచ్చాడు. వెస్​ అగర్​ 2 ఓవర్లు వేసి 4 వికెట్లు తీసి 6 పరుగులు ఇచ్చాడు. అంతకు ముందు అడిలైడ్​ జట్టు 139 పరుగులు చేసింది.

ట్యాగ్స్​