మధుమేహంతో బాధపడే వారికి ఇది నిజంగా శుభవార్తే. టైప్-1 డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు ఇకపై రోజూ ఇన్సులిన్ ఇంజక్షన్లు పొడుచుకునే బాధ తప్పుతుంది. అతి త్వరలోనే ట్యాబ్లెట్ల రూపంలో ఇన్సులిన్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. ఈ మేరకు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధన విజయవంతమైంది. రక్తంలో చక్కెర స్థాయులను ఇన్సులిన్ నియంత్రిస్తుంది. ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయ మాలిక్యుల్‌ను మెల్‌బోర్న్‌లోని వాల్టర్ అండ్ ఎలిజా హాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పరిశోధకులు డాక్టర్ నికోలస్ కిర్క్, ప్రొఫెసర్ మైక్ లారెన్స్ కనుగొన్నారు.