ప్రతిపక్ష నేత చంద్రబాబు రోడ్ షోలలో వరుసగా తొక్కిసలాటలు జరుగుతుండడంతో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్ షోలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్టేట్, మున్సిపల్, పంచాయతీరాజ్ రోడ్లపై కాకుండా ప్రత్యామ్నాయ ప్రదేశాలు ఎంపిక చేయాలని సూచించింది. రాష్ట్ర, మున్సిపల్, పంచాయితీ (ఇంకా చదవండి)
విధులకు ఆలస్యంగా వచ్చే ఉద్యోగుల జీతాల్లో కోత విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం జారీచేసిన తాజా ఆదేశాల ప్రకారం నిర్ధేశించిన సమయానికన్నా పది నిమిషాలు ఆలస్యంగా వచ్చినా జీతంలో కోత పడనుంది. దీంతో ఈ విషయం ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తమ అసంతృప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి (ఇంకా చదవండి)
దేశంలో కరోనా తీవ్రత పెరుగుతందని వస్తున్న నివేదికల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ సర్వసన్నద్ధమవుతోంది. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రజని తమకు అత్యవసరంగా కొవిడ్ వ్యాక్సిన్లను పంపాలని కేంద్ర మంత్రిని కోరారు. ప్రస్తుతం తమ (ఇంకా చదవండి)
కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితిని రెండేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏపీ పోలీస్ శాఖలో 6100 కానిస్టేబుల్ పోస్టులు, 411 ఎస్సై పోస్ట్ లకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే .నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి (ఇంకా చదవండి)
నిధులు లేక కష్టాలు పడుతున్న ఏపీ సర్కార్ కు కేంద్రం తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని పలు పాఠశాల భవనాల మర మత్తులు మరియు ఇతర మౌలిక వసతుల కల్పనకు సమగ్ర శిక్ష అభియాన్ కింద రూ.867 కోట్లు విడుదల చేసింది. ఈ ఏడాది డిసెంబర్ 15వ తేదీ నాటికి (ఇంకా చదవండి)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు సమాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించే అధికారి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్రం బుధవారం స్పష్టం చేసింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖల మంత్రి ప్రతిమా భౌమిక్ సమాధానమిచ్చారు. ‘విద్య, ఉపాధి కోసం కొత్తగా ఎవరినైనా (ఇంకా చదవండి)
ఏపీలోని మూడు విమానాశ్రయాలు ప్రైవేటు పరం కానున్నాయి. 2022 – 2025 మధ్య కాలంలో నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ కింద దేశంలోని 25 విమానాశ్రయాలను లీజుకు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. వీటిలో ఏపీకి చెందిన విజయవాడ, తిరుపతి, రాజమండ్రి ఎయిర్ పోర్టులు ఉన్నాయి. ఈ విషయాన్ని రాజ్యసభలో ఒక (ఇంకా చదవండి)
2023 సంవత్సరానికి ప్రభుత్వ ఉద్యోగులకు, విద్యాసంస్థలకు సాధారణ సెలవులు, ఐచ్చిక సెలవుల జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. మొత్తం 23 సాధారణ సెలవులను, 22 ఐచ్చిక సెలవులను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అంతర్జాతీయ (ఇంకా చదవండి)
ఏపీలో స్మార్ట్ ఎలక్ట్రిక్ మీటర్ల ప్రక్రియను వేగవంతం చేశారు. గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాలని డిస్కంలు ప్రతిపాదించాయి. ఈ ప్రతిపాదనలకు జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో ఒకటి, రెండు రోజుల్లో టెండర్లు పిలవాలని డిస్కంలు నిర్ణయించాయి. మరోవైపు స్మార్ట్ మీటర్ల (ఇంకా చదవండి)