Elon Musk

పాపులర్ వార్తలు

 • ట్విట్టర్లో మిగిలింది 2750 మందేనట

  2 weeks ago

  ఉద్యోగులను తొలగించడానికే ట్విట్టర్​ ను కొన్నట్టు వ్యవహరిస్తున్న ఎలన్​ మస్క్ దెబ్బకు ఇప్పుడు ఆ యాప్​ లో కేవలం 2750 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నట్లు సమాచారం. అంతకు ముందు ఈ సోషల్​ మీడియా యాప్​ లో ప్రపంచవ్యాప్తంగా 7500 లకు పైగా ఉద్యోగులు పనిచేసేవారు. ఇప్పుడు ఆ సంఖ్య (ఇంకా చదవండి)

 • మస్క్​: ట్విట్టర్​ బ్లూటిక్​ సేవలు ఇప్పట్లో రావు

  2 weeks ago

  ట్విట్టర్లో బ్లూ టిక్​ కోసం సబ్​ స్క్రిప్షన్​ పొందే అవకాశం ఇప్పట్లో వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ విషయాన్ని ఆ సంస్థ కొత్త బాస్​ ఎలన్​ మస్క్​ వెల్లడించాడు. నకిలీ ఖాతాల్ని అరికట్టడంపై పూర్తి విశ్వాసం ఏర్పడిన తర్వాతే ఈ సేవల్ని తిరిగి అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు.అలాగే (ఇంకా చదవండి)

 • స్పేస్​ ఎక్స్​ లోనూ ఇదే గొడవట

  3 weeks ago

  ట్విట్టర్​ ఉద్యోగులకు రోజుకో కొత్త రూల్​ పెడుతూ.. పనిగంటలు పెంచుతూ బెదిరింపులకు దిగుతున్న బిలియనీర్​ ఎలన్​ మస్క్​.. తన మరో కంపెనీ స్పేస్​ ఎక్స్​ లోనూ ఛండశాసనుడిలానే ఉంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ కంపెనీ నుంచి కూడా ఉద్యోగులు తప్పుకుంటున్నారని రాయిటర్స్​ పత్రిక రిపోర్ట్​ చేసింది. బాస్​ తీసుకున్న కొన్ని (ఇంకా చదవండి)

 • మస్క్​ : పనిచేయండి లేదా ఉద్యోగం వదిలేయండి

  3 weeks ago

  ట్విట్టర్ సిబ్బంది అత్యధిక తీవ్రతతో ఎక్కువ గంటల పాటు పనిచేయడానికి కట్టుబడి ఉండాలని లేనిపక్షంలో కంపెనీ నుంచి వెళ్లిపోవాలని ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించాడు. కంపెనీని తన హస్తగతం చేసుకున్న రోజు నుంచీ ట్విట్టర్​ ఉద్యోగులపై ఏదో పాత కక్షలు ఉన్నట్లు వ్యవహరిస్తున్న ఆయన తీరు ప్రతీరోజూ వివాదాస్పదమవుతోంది. ట్విట్టర్‌లో ఉండాలనుకుంటే (ఇంకా చదవండి)

 • ట్విట్టర్​: 29 నుంచి మళ్ళీ బ్లూ టిక్​

  3 weeks ago

  ట్విట్టర్లో తీవ్ర కన్ఫ్యూజన్​ కు కారణమవుతున్న బ్లూ టిక్​ సేవలను ఈనెల 29 నుంచి తిరిగి పునరుద్దరిస్తున్నట్లు ఆ కంపెనీ బాస్​ ఎలన్​ మస్క్​ ప్రకటించారు.గతంలో బ్లూ టిక్​ కోసం ఛార్జీలు వసూలు చేయడంతో కొంత మంది 8 డాలర్లు చెల్లించి సెలబ్రిటీలు, బడా వ్యాపార సంస్థల పేరిట నకిలీ (ఇంకా చదవండి)

 • ట్విట్టర్‌లో మరో 4,400 ఉద్యోగాలు ఫట్‌

  3 weeks ago

  టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత అందులోని ఉద్యోగుల భవిష్యత్తు తీవ్ర గందరగోళంగా మారింది. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా ఆ సంస్థకు ఉన్న మొత్తం ఉద్యోగుల్లో సగం మందిని అంటే 3500 సిబ్బందిని తొలగించిన విషయం (ఇంకా చదవండి)

 • బ్లూ టిక్.. ఇచ్చినట్టే ఇచ్చి నిలిపేసిన ట్విట్టర్​

  3 weeks ago

  ఏ ముహూర్తాన ట్విట్టర్లో ఎలన్​ మస్క్​ చేయి పెట్టాడో కానీ.. అప్పటి నుంచీ ఆ కంపెనీ తీసుకునే ప్రతీ నిర్ణయం వివాదాస్పదమవుతూనే ఉంది. అధికారిక ఖాతాలకు ఇచ్చే బ్లూ టిక్​ కు డబ్బులు చెల్లించాల్సిందేనని చెప్పిన ఆ కంపెనీ ఆ సేవల్ని నిన్నటి నుంచే భారత్​ లో తీసుకొచ్చి ఆపై (ఇంకా చదవండి)

 • లక్షల కోట్ల కంపెనీ.. కానీ ఉద్యోగులకు భోజనం కూడా

  3 weeks ago

  పేరుకు రూ.3 లక్షల కోట్ల కంపెనీ.. అయితే ఏం తమ కంపెనీ ఉద్యోగులకు కనీసం ఉచిత భోజనం కూడా పెట్టలేకపోతోంది! ఏ కంపెనీ గురించి చెబుతున్నామనే కదా మీ డౌట్​! ఇంకే కంపెనీ.. మస్క్​ చేతికి ఇటీవలే వచ్చిన ట్విట్టర్​ పరిస్థితి ఇది. ఇటీవలే శాన్​ ఫ్రాన్సిస్కో లోని ఉద్యోగులతో (ఇంకా చదవండి)

 • మస్క్​: కష్టపడి పనిచేయండి లేదంటే దివాళా తీస్తాం

  4 weeks ago

  ట్విట్టర్​ ను కొనుగోలు చేసిన రోజు నుంచే ఆ సంస్థలోని ఉద్యోగులపై కక్ష సాధిస్తున్న ఎలన్​ మస్క్​.. మరోసారి వారిపై దయలేకుండా వ్యాఖ్యలు చేశాడు. ‘కంపెనీ ఇచ్చే చిన్న చిన్న సౌలభ్యాలను వదులుకోకపోతే ట్విట్టర్​ దివాలా తీస్తుంది. కాబట్టి కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉండండి.. లేదా ఇంతకంటే చీకటి రోజులకు (ఇంకా చదవండి)