Odisha

పాపులర్ వార్తలు

 • తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

  3 months ago

  తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, బెంగాల్​ కోస్తా తీరాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఛత్తీస్​ఘడ్​, తూర్పు మధ్యప్రదేశ్​, విదర్భ ప్రాంతాల్లోనూ రాబోయే రోజుల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆదివారం ప్రకటించింది. ఎపి, తెలంగాణతో పాటు ఉత్తరాఖండ్​, ఉత్తరప్రదేశ్​, బీహార్​, ఝార్ఖండ్​, ఛత్తీస్​ఘడ్, తమిళనాడు, కేరళలలో కొన్ని (ఇంకా చదవండి)

 • బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

  3 months ago

  బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ శుక్రవారం ప్రకటించింది. దీని ప్రభావంతో వచ్చే వారం ఉత్తరాంధ్రతో పాటు ఒడిశాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గడిచిన రెండు వారాల్లో ఇది రెండో అల్పపీడనం కాగా.. 2 నెలల్లో ఐదవది. ఆదివారం నాటికి అప్పర్​ (ఇంకా చదవండి)

 • ఒడిశా: కోహినూర్​ పూరీ జగన్నాథుడిది!

  3 months ago

  బ్రిటన్​ రాణి క్వీన్​ ఎలిజిబెత్​–2 మరణానంతరం ఆమె కిరీటంలో చిక్కుకున్న భారత్​కు చెందిన కోహినూర్​ను తిరిగి స్వదేశానికి తీసుకురావాలన్న డిమాండ్​ ఊపందుకుంటోంది. తాజాగా ఈ విలువకట్టలేని వజ్రం ఒడిశాలోని పూరీ జగన్నాథుడిదేనని అక్కడి జగన్నాథ్​ సేన పేర్కొంది. దానిని తిరిగి యుకే నుంచి భారత్​కు తెప్పించాలని డిమాండ్​ చేస్తున్న ఈ (ఇంకా చదవండి)

 • సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిసైల్‌ పరీక్ష విజయవంతం

  3 months ago

  ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించేందుకు ఉపయోగించే వర్టికల్‌ లాంచ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిసైల్‌ (వీఎల్‌-ఎస్‌ఆర్‌శామ్‌)ను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరానికి చేరువలో ఒక యుద్ధనౌక నుంచి ఈ ప్రయోగం జరిగింది. డీఆర్‌డీవో ఆధ్వర్యంలో భారత నౌకాదళం ఈ క్షిపణి పరీక్షను నిర్వహించింది. వేగంగా దూసుకెళుతున్న ఒక (ఇంకా చదవండి)

 • అల్యుమినియం బిజినెస్​లోకి అదానీ

  4 months ago

  భారత వ్యాపార దిగ్గజం, ప్రపంచ కుబేరుడు గౌతమ్​ అదానీ మరో వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఒడిశా రాష్ట్రంలో రూ. 41 వేల కోట్లతో అల్యూమినియం శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు. ఈ విషయాన్ని ఒడిశా సిఎం నవీన్​ పట్నాయక్​ కార్యాలయం ట్వీట్​ చేసింది. ఈ రంగంలో తన ముద్ర (ఇంకా చదవండి)

 • కెమెరాలో చిక్కిన బ్లాక్​ టైగర్​

  4 months ago

  ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ సంఖ్యలో ఉన్న బ్లాక్​ టైగర్​ ఒడిశాలోని సిమిలిపాల్​ టైగర్​ రిజర్వ్​లో కనిపించింది. ఫారెస్ట్​ ఆఫీసర్​ సుసంత నంద పోస్ట్​ చేసిన 16 సెకండ్ల వీడియోలో ఓ పెద్ద చెట్టు ఎక్కిన ఈ బ్లాక్​ టైగర్​ తన శరీరాన్ని బాగా స్ట్రెచ్​ చేసుకుంటూ ఇది నా ప్రాంతం (ఇంకా చదవండి)

 • ముర్ము సొంత రాష్ట్రంలో సంబరాలు

  5 months ago

  రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించడంపై ఆమె సొంత రాష్ట్రం ఒడిశాలో సంబరాలు అంబరాన్ని తాకాయి. సొంత పార్టీ బీజేపీతో పాటు ఆమె కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. బాణాసంచా కాల్చి.. స్వీట్లు పంచుకున్నారు. ప్రతిభా పాటిల్ తరువాత భారత్​కు రాష్ట్రపతి అయిన రెండో (ఇంకా చదవండి)

 • వైభవంగా ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర

  5 months ago

  ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథ రథయాత్ర ఈరోజు వైభవంగా ప్రారంభమైంది. గత రెండేళ్ళుగా కరోనా వల్ల ఈ వేడుకలకు దూరమైన భక్తులు ఈసారి భారీ ఎత్తున తరలివచ్చారు. అధికారులు సైతం ఈ యాత్రకు భక్తులను అనుమతించడంతో లక్షలాదిగా తరలి వచ్చేశారు. జగన్నాథ నామస్మరణతో పూరీ వీధులు మారు మ్రోగిపోతున్నాయి. ఆనవాయితీ (ఇంకా చదవండి)

 • మావోయిస్టుల దాడిలో ముగ్గురు జవాన్ల హతం

  6 months ago

  ఒడిశాలోని న్యూపాద జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు జరిపిన దాడిలో ముగ్గురు సిఆర్​పిఎఫ్​ జవాన్లు అమరులయ్యారు. ఓ రోడ్డు ఓపెనింగ్ జరుగుతుండగా అక్కడ ఉన్న జవాన్లపై మావోయిస్టులు దాడి చేశారు. మరణించిన వారిని ఉత్తరప్రదేశ్​కు చెందిన శిశుపాల్​ సింగ్​, హర్యానాకు చెందిన శివలాల్​, ధర్మేంద్ర (కానిస్టేబుల్​)లుగా గుర్తించారు. నిన్న మధ్యప్రదేశ్​లోని (ఇంకా చదవండి)