students

పాపులర్ వార్తలు

 • తెలంగాణ కాలేజీలో 25 మందికి కరోన

  4 weeks ago

  రంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రైవేటు కాలేజీ కరోనా హాట్​స్పాట్​గా మారింది. నర్సింగి పట్టణంలోని శ్రీ చైతన్య కాలేజీలో చదువుతున్న 25 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్​గా తేలింది. క్రిస్​మస్​ సెలవుల తర్వాత వీరంతా కాలేజీకి వచ్చారు. వీరిలో కరోనా లక్షణాలు ఉండడంతో పరీక్షలు జరపగా పాజిటివ్​గా తేలింది. దీంతో వీరందరినీ (ఇంకా చదవండి)

 • మధ్యాహ్న భోజనంలో బల్లి.. 80 మందికి అస్వస్థత

  4 weeks ago

  కర్ణాటకలోని హవేరి జిల్లాలో స్కూలులో వండిన మధ్యాహ్న భోజన పథకంలో బల్లి పడడంతో 80 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంకటాపుర తాండ గ్రామంలో జరిగిన ఈ ఘటనతో విద్యార్థులందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరంతా క్షేమంగానే ఉన్నారని డిశ్చార్జ్​ చేస్తున్నామని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై (ఇంకా చదవండి)

 • అందరినీ పాస్​ చేసే ఆలోచనలో ఇంటర్​ బోర్డ్​

  1 month ago

  ఇంటర్​ పరీక్షల్లో విద్యార్థులందరిని పాస్​ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈమేరకు పరీక్ష రాసిన ప్రతీ విద్యార్థికీ 30 శాతం మార్కులు అదనంగా జత చేయనుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్ధి సంఘాలు చేస్తున్న పోరాటం ఫలితాన్నిచ్చినట్లే కనిపిస్తోంది. ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయంతో పరీక్ష రాసిన ప్రతి ఒక్కరూ (ఇంకా చదవండి)

 • స్వర్ణముఖిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతు

  1 month ago

  స్వర్ణముఖి నదిలో సరదాగా చేపల వేటకు వెళ్లిన నలుగురు యువకుల్లో ముగ్గురు వరద నీటికి కొట్టుకుపోయిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఒకరిని స్థానికులు కాపాడారు. మరణించిన వారిలో రేణిగుంట మండలం ఎస్సీ కాలనీకి చెందిన గణేష్​ (15), యుగంధర్​ (15), ధోని (16)లు ఉన్నారని తెలుస్తోంది. లికిత్​ సాయి (ఇంకా చదవండి)

 • నేడు జూ.కాలేజీల బంద్​

  1 month ago

  ఇటీవల విడుదలైన ఇంటర్​ ఫస్ట్​ ఇయర్​ పరీక్షా ఫలితాల్లో విద్యార్థులందరినీ పాస్​ చేయాలని డిమాండ్​ చేస్తూ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా జూనియర్​ కళాశాలల బంద్​ పాటిస్తున్నారు. ఎస్​ఎఫ్​ఐ, ఏఐఎస్​ఎఫ్​, పీడిఎస్​యు, ఏఐడీఎస్​ఓ సంఘాల ఆధ్వర్యంలో ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్​ పాటించాలని ఇచ్చిన పిలుపు మేరకు కాలేజీలు బంద్​ (ఇంకా చదవండి)

 • బాత్రూమ్​ గోడ కూలి ముగ్గురు విద్యార్థులు మృతి

  1 month ago

  తమిళనాడు తిరునల్వేలిలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాల బాత్రూమ్​ గోడ కూలి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు జరిగిన ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఘటన జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్​ ఘటనా స్థలానికి వచ్చి ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి (ఇంకా చదవండి)

 • విద్యార్థి హత్య కేసులో 20 మందికి ఉరి శిక్ష

  2 months ago

  బంగ్లాదేశ్​లో యూనివర్శిటీ విద్యార్థిని చంపిన 20 మంది తోటి విద్యార్థులకు కోర్టు మరణ శిక్షను విధించింది. భారత్​తో నీటి ఒప్పందాలు చేసుకుందన్న కోపంతో అబ్రార్​ ఫహాద్​ అనే విద్యార్ధి సోషల్​ మీడియాలో బంగ్లాదేశ్​కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడు. దీంతో అవామీ లీగ్​, బంగ్లాదేశ్​ ఛత్ర లీగ్​ పార్టీకి చెందిన 25 (ఇంకా చదవండి)

 • ఎంసెట్​ సీట్ల అలాట్​మెంట్​ రిజల్ట్స్​ రేపే

  2 months ago

  ఎపి ఎంసెట్​ 2021 సీట్​ అలాట్​మెంట్​ ఫలితాలను ప్రభుత్వం గురువారం వెల్లడించనుంది. eapcet-sche.aptonline.in వెబ్​సైట్​లో ఈ వివరాలను ప్రభుత్వం పెట్టనుంది. ఈ జాబితాలో పేర్లున్న అభ్యర్ధులు వెంటనే సంబంధిత కాలేజీలను కలిసి ఎపి ఎంసెట్​ 2021 అడ్మిట్​కార్మట్​తో పాటు ట్రాన్స్​ఫర్​ సర్టిఫికెట్​, డేట్​ ఆఫ్​ బర్త్​ ప్రూఫ్​, టెన్త్​ క్లాస్​, (ఇంకా చదవండి)

 • స్కూల్లో 130 మంది విద్యార్థులకు కరోనా

  2 months ago

  కర్ణాటక వ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే స్కూల్​ విద్యార్థుల్లో 130 మంది కరోనా బారిన పడ్డారు. 1 నుంచి 10వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులు ఇలా స్కూలులో కరోనా బారిన పడ్డారు. చిక్​మంగళూరులోని జవహర్​ నవోదయ విద్యాలయ రెసిడెన్షియల్​ స్కూల్​లో 92 మంది విద్యార్థులు, చామరాజనగర్​లో 11 మంది విద్యార్థులకు (ఇంకా చదవండి)