Telangana

పాపులర్ వార్తలు

 • భోదన ఆసుపత్రులకు పోస్టులను మంజూరు చేసిన టిఎస్​ సర్కార్

  6 days ago

  తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా తెలంగాణలో 9 జిల్లా కేంద్రాల్లో వచ్చే ఏడాది ప్రారంభం కానున్న బోధనాసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన మేరకు పోస్టులను కేటాయిస్తూ గురువారం నిర్ణయం తీసుకుంది. ఒక్కో బోధనాసుపత్రికి 433 పోస్టుల చొప్పున మొత్తంగా 3,897 పోస్టులను భర్తీ చేసేందుకు (ఇంకా చదవండి)

 • ఎమ్మెల్యేల ఎర కేసు : ముగ్గురు నిందితులకు బెయిల్‌

  7 days ago

  టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ఎర కేసులో నిందితులైన ముగ్గురుకి ఈరోజు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. కేసులో నిందితులైన నందు, సింహయాజీ, రామచంద్ర భారతి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు వారికి బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో సిట్ దర్యాప్తు (ఇంకా చదవండి)

 • డిఎస్సీతోనే టీచర్ రిక్రూట్​మెంట్

  7 days ago

  సర్కారు బడుల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను మళ్లీ పాత విధానంలోనే భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో టీఎస్​పీఎస్సీ ద్వారా ఆ పోస్టులను నింపగా, ఈసారి తిరిగి స్కూల్ ఎడ్యుకేషన్ కే ఆ బాధ్యతలు అప్పగించాలని సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే ఫైనాన్స్​డిపార్ట్​మెంట్ (ఇంకా చదవండి)

 • తెలంగాణ: చిక్కెన్ పెట్టలేదని పెళ్లి క్యాన్సిల్

  1 week ago

  మంచోడి బుద్ది మాంసం దగ్గర బయటపడుతుందటా. పెళ్లి విందులో చికెన్ వడ్డించలేదన్న కారణంతో మగ పెళ్లివారు వివాహాన్ని రద్దు చేసుకున్నారు. హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలోని షాపూర్‌నగర్‌లో జరిగిందీ ఘటన. జగద్గిరిగుట్ట రింగ్ బస్తీకి చెందిన యువకుడికి, కుత్బుల్లాపూర్‌కు చెందిన యువతికి వివాహం నిశ్చయమైంది. ఆడపెళ్లివారు ఏర్పాటు చేసిన విందులో అన్నీ (ఇంకా చదవండి)

 • ఫిబ్రవరిలో మినీ మేడారం జాతర

  1 week ago

  వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 4వ తేదీ వరకు మేడారం సమ్మక్క-సారలమ్మల మినీ జాతర జరగనుంది. 4 రోజుల పాటు ఈ మినీ జాతరను నిర్వహిస్తారు. అమ్మవార్ల పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పడిగిద్దరాజు పూజారులు సమావేశమై వ‌చ్చే ఏడాది ఫిబ్రవరిలో జాత‌ర‌ను (ఇంకా చదవండి)

 • తెలంగాణ: పాఠశాలల గ్రాంట్ విడుదల

  1 week ago

  బడులు తెరిచి ఐదున్నర నెలలు గడిచాక ఎట్టకేలకు ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు అవసరమైన స్కూల్ గ్రాంట్ లో 50 శాతాన్ని విడుదల చేశారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ మేనేజర్ దేవసేన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ సాధారణ పాఠశాలలతో పాటు ఆదర్శ, గిరిజన సంక్షేమ, క్రీడా, అందుల పాఠశాలలకు (ఇంకా చదవండి)

 • అమెరికా : నదిలో గల్లంతై ఇద్దరు తెలంగాణ విద్యార్థుల

  1 week ago

  ఉన్నత విద్యకోసం అమెరికా వెళ్లిన తెలంగాణ విద్యార్థులు ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. వికారాబాద్‌ జిల్లా తాండూరుకు చెందిన శివదత్త, నక్కలగుట్టకు చెందిన ఉత్తేజ్‌ పై చదువుల కోసం కొన్నినెలల క్రితమే అమెరికా వెళ్లారు. సెయింట్‌ లూయిస్‌ యూనివర్సిటీలో ఇద్దరూ ఎంఎస్‌ చదువుతున్నారు. వీకెండ్ సందర్భంగా శనివారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి (ఇంకా చదవండి)

 • వైఎస్ భారతి ఆస్తుల అటాచ్ పై హైకోర్టు లో

  1 week ago

  వైఎస్ భారతి ఆస్తులను ఈడీ అటాచ్ చేయడంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం రాయదుర్గంలోని భూమి, సండూర్ షేర్లను జప్తు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. సిలికాన్ బిల్డర్స్, భగవత్ సన్నిధి భూములు, భవనాలు, రేవా ఇన్ ఫ్రా భూములు, భవనాల విడుదలకు ఆదేశాలు ఇచ్చింది. (ఇంకా చదవండి)

 • హైదరాబాద్ : నేటి నుంచి కఠినంగా ట్రాఫిక్స్ రూల్స్

  1 week ago

  హైదరాబాద్‌లో నేటి నుండి ట్రాఫిక్‌ రూల్స్‌ మరింత కఠినతరం కానున్నాయి. నేటి నుంచి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్‌ నియమాలను ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు తప్పవని అధికారులు హెచ్చరించారు. రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌, ట్రిపుల్‌ రైడింగ్‌ చేస్తే పెద్దమొత్తం జరిమానాలు విధించనున్నారు. సోమవారం నుంచి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. రాంగ్ రూట్ (ఇంకా చదవండి)