దేశంలో పెరుగుతున్న మంకీపాక్స్ కేసులను నియంత్రించడానికి కేంద్రం వ్యాక్సిన్ తయారీ సంస్థలతో చర్చలు జరుపుతోంది. ఇప్పటికే డబ్ల్యుహెచ్ఓ ఈ వైరస్‌ను అత్యంత ప్రమాదకర వైరస్‌గా ప్రకటించడంతో కేంద్రం దీని నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. మంకీపాక్స్ నియంత్రణకు వ్యాక్సిన్ తయారీ చేపట్టాలని కేంద్రం ఆయా సంస్థలకు కోరింది. ఈ (ఇంకా చదవండి)
ప్రపంచంలో కరోనా వైరస్ ఎలాంటి అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా తిరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్యానించింది. కొవిడ్ ముగిసిందన్న ధీమాతో ప్రపంచ జనాభా జీవిస్తోందని, కొత్త దారిలో ఈ వైరస్ దాడి చేసే అవకాశం ఇంకా తొలగిపోలేదని ఆ సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ పేర్కొన్నారు. ‘కొత్త వేవ్‌లు వస్తూనే (ఇంకా చదవండి)
ఆఫ్రికా దేశాలతో పాటు ఫ్రాన్స్, ఇంగ్లాండ్ మరికొన్ని యూరప్ దేశాలను వణికిస్తున్న మంకీపాక్స్ వైరస్‌ను ఇకపై మహమ్మారిగా గుర్తిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య నెట్ వర్క్ (డబ్ల్యుహెచ్ఎన్) ప్రకటించింది. ఈ మహమ్మారిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మీటింగ్ జరపనున్న నేపధ్యంలో డబ్ల్యుహెచ్ఎన్ చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. స్మాల్‌పాక్స్ వైరస్‌తో పోల్చితే (ఇంకా చదవండి)
ప్రపంచ దేశాలపై మళ్ళీ పడగవిప్పుతున్న కరోనా పుట్టుకను తేల్చడానికి అవసరమైన పరిశోధనలు జరగాల్సి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇప్పటి వరకూ తమ సంస్థ జరిపిన పరిశోధనల్లో ఈ వైరస్ పుట్టుకపై ఎలాంటి ఖచ్చితమైన ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది. చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ (ఇంకా చదవండి)
ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌గా మరోసారి టెడ్రోస్ అథనోమ్ ఎంపికయ్యారు. మరో ఐదేళ్ళ పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నట్లు ఏఎఫ్‌పీ రిపోర్ట్ చేసింది. ఆఫ్రికాలోని ఇథియోపియా దేశానికి చెందిన టెడ్రోస్ పదవీకాలం ముగుస్తుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్షిక సమావేశం నిర్వహించి తిరిగి ఆయననే చీఫ్‌గా ఎన్నుకుంది. 2017లో (ఇంకా చదవండి)
కొవిడ్ తగ్గిన సమయంలో మంకీపాక్స్ వైరస్ విజృంభణ ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో 100కు పైగా కేసులు రావడంతో డబ్ల్యుహెచ్ఓ అప్రమత్తమైంది. పశ్చిమ, మధ్య ఆఫ్రికా దేశాల్లో తరచుగా తలెత్తే ఈ వ్యాధి ఇతర దేశాలకూ వేగంగా వ్యాపిస్తోందని పేర్కొంది. రాబోయే రోజుల్లో మరిన్ని దేశాల్లోనూ ఈ (ఇంకా చదవండి)
భారత్‌లో పనిచేస్తున్న పది లక్షల మంది ఆశా వర్కర్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యున్నత అవార్డు దక్కింది. వీరిని గ్లోబల్ హెల్త్ లీడర్స్ వర్ణిస్తూ డబ్ల్యుహెచ్ఓ తన ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందించడం, కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించడంలో వీరి కృషి అపారమని (ఇంకా చదవండి)
దేశంలో కరోనా మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన సంఖ్యే నిజమైనదని ట్విట్ర్లో రాహుల్ గాంధీ కేంద్రాన్ని విమర్శించారు. దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4.8 లక్షలు కాదన్న ఆయన.. 48 లక్షలు గా పేర్కొన్నారు. సైన్స్ ఎప్పుడూ అబద్దం చెప్పదని.. నరేంద్ర మోదీనే అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. (ఇంకా చదవండి)
ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలను కొన్ని దేశాలు తగ్గించి చూపుతున్నాయని డబ్ల్యుహెచ్ఓ ప్రకటించింది. ఈ మహమ్మారితో 1.5 కోట్ల మంది మరణించి ఉంటారని పేర్కొన్న ఆ సంస్థ.. ఒక్క భారత్‌లోనే 47 లక్షల మంది మరణించారని తెలిపింది. అధికారిక గణాంకాల కంటే ఇది 10 రెట్లు అధికమని ప్రకటించింది. అయితే ఈ (ఇంకా చదవండి)