తైవాన్​: చైనా విమానాలు మా గగనతలంలోకి

By udayam on December 26th / 9:20 am IST

గత 24 గంటల్లో 43 చైనా యుద్ధ విమానాలు తైవాన్ సముద్ర భూభాగం మీదుగా చక్కర్లు కొట్టి నిబంధనలు ఉల్లంఘించాయని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. ఈ ఘటనలో మొత్తం 71 చైనా విమానాలు పాల్గొన్నట్లు తెలిపింది. ఈ విమానాలు తైవాన్ గల్ఫ్‌ను రెండు భాగాలుగా విభజించే ఊహాత్మక మధ్యస్థ రేఖను దాటాయని రాయిటర్స్ వార్తా సంస్థ తన కథనంలో తెలిపింది. ఈ ఘటనపై చైనా స్పందిస్తూ తైవాన్ చుట్టుపక్కల సముద్ర, గగనతలంలో గత ఆదివారం ‘స్ట్రైక్ డ్రిల్స్’ నిర్వహించినట్లు స్పష్టంచేసింది. తైవాన్‌ తన భూభాగమని చైనా చెప్పింది.

ట్యాగ్స్​