లక్షలాది మంది పర్యాటకులు సందర్శించే ఆగ్రాలోని తాజ్‌మహల్‌కి పన్ను చెల్లించాలంటూ మునిసిపల్ అధికారులు నోటీసులిచ్చారు. 370 ఏళ్ల తాజ్ చరిత్రలో ఇలాంటి నోటీసులు రావడం ఇదే తొలిసారని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు పేర్కొన్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తాజ్ మహల్‌తో పాటు ఆగ్రా కోటకు కూడా బకాయిలు చెల్లించాలంటూ నోటీసులివ్వడం గమనార్హం.తాజ్‌మహల్‌పై ఉన్న బకాయి రూ.1.4 లక్షల ఇంటి పన్ను చెల్లించాలని, బకాయిలను క్లియర్ చేయడానికి ఎఎస్‌ఐకి 15 రోజుల గడువు ఇచ్చారు.