తాజ్ మహల్‌లోని మూసి ఉన్న 22 గదులను తెరవాలంటూ బిజెపి యూత్ మీడియా ఇంఛార్జ్ రజనీశ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్ కోర్ట్ కొట్టేసింది. మూసి ఉన్న గదుల్లో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయో లేదో తేల్చాలంటూ రజనీశ్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశాడు. దాంతో పాటు ఒకప్పుడు శివాలయం ఉన్న ప్రాంతంలో తాజ్ మహల్ నిర్మించాన్న వార్తలపైనా నిజనిర్ధారణ వేయాలని పిటిషనర్ కోర్టును అభ్యర్థించాడు.