నేను చనిపోలేదు : ఘని

By udayam on September 13th / 1:05 pm IST

ఆఫ్ఘనిస్థాన్​కు డిప్యూటీ ప్రధానిగా ఎన్నికైన తాలిబాన్​ సహ వ్యవస్థాపకుడు అబ్దుల్​ ఘనీ బరాదర్​ చనిపోయాడని వస్తున్న వార్తలపై అతడు స్వయంగా స్పందించాడు. ఈ మేరకు ఓ ఆడియో సందేశాన్ని ఘని విడుదల చేశాడు. తాను చనిపోయానని పశ్చిమ దేశాల్లోని మీడియానే సృష్టించిందని, దాంతో మా వర్గంలో అలజడి సృష్టించాలని వారి పన్నాగమని పేర్కొన్నాడు. ‘నా మరణంపై వస్తున్న తప్పుడు వార్తలు చూశా. తానింకా బతికే ఉన్నా.. దేశం కోసం ప్రస్తుతం కొన్ని పర్యటనల్లో ఉన్నాను’ అంటూ ఆడియో సందేశంలో అతడు చెప్పుకొచ్చాడు.

ట్యాగ్స్​