ఖైదీల చేతికి జైలు బాధ్యతలు

By udayam on September 14th / 8:18 am IST

ఒకప్పుడు కాబూల్​ సెంట్రల్​ జైలులో రోజుల తరబడి మగ్గిపోయిన తాలిబాన్​ నేతలు తాజాగా అదే జైలుకు అధికారులయ్యారు. ఆఫ్థన్​ మొత్తాన్ని తమ కంట్రోల్​ తీసుకున్న తాలిబాన్లు అదే జైలులో శిక్ష అనుభవించిన వారికి ఆ జైలు బాధ్యతల్ని అప్పగించారు. డజన్ల కొద్దీ తాలిబాన్​ ఫైటర్లు తాజాగా ఆ బాధ్యతల్ని స్వీకరించారు. ఇదే జైలులో 14 నెలలు శిక్ష అనుభవించిన తాలిబాన్​ కమాండర్​ ఒకరు ఈ విషయాన్ని ఎపి న్యూస్​ నెట్​వర్క్​తో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఆ రోజుల్లో మమ్మల్ని టార్చర్​ చేశారు. ఇప్పుడు ఈ జైలే మాది’ అన్నాడు.

ట్యాగ్స్​