పాకిస్థాన్‌లోని ఓ పోలీస్‌స్టేషన్‌ని తాలిబన్లు నిర్బంధించారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని కౌంటర్ టెర్రరిజమ్ డిపార్ట్‌మెంట్ దాడి చేసిన తాలిబాన్లు.. అందులో ఉన్న 9 మంది పాక్ పోలీసులను నిర్బంధించారు. గతంలో అరెస్ట్ చేసిన కొందరు తాలిబన్ ఉగ్రవాదుల్లో ఒకరిని ఆదివారం సిటిడి అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆ సమయంలో అతడు ఒక అధికారి నుండి ఎకె-47ని లాక్కుని అధికారులపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీస్ అధికారులు మృతి చెందారు. ఇతర ఉగ్రవాదుల్ని కూడా విడిపించి, ఆ కేంద్రాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు.