ఆఫ్గనిస్తాన్ లో మహిళలకు విశ్వవిద్యాలయ విద్యపై దేశవ్యాప్తంగా నిషేధం విధించాలని మంగళవారం తాలిబాన్లు ఆదేశించారు. గత సంవత్సరం వారు అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుంచి మహిళల జీవితంలోని అన్ని అంశాలపై ఆంక్షలను విధిస్తూ వస్తున్నారు. తదుపరి నోటీసు వచ్చేవరకు ఆడపిల్లల విద్యను నిలిపివేసే ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని ఉన్నత విద్యాశాఖ మంత్రి నేడా మహ్మద్ నదీమ్ సంతకం చేసిన లేఖను అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు జారీ చేశారు.