ఆఫ్ఘన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం అక్కడి మహిళలపై విధిస్తున్న ఆంక్షలు రోజురోజుకీ తీవ్రమవుతున్నాయి. తాజాగా ఆ దేశంలోని మహిళలెవరికీ డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసేది లేదని ప్రకటించింది. ఈ నిర్ణయం కాబూల్‌తో పాటు దేశంలోని అన్ని ప్రావిన్స్‌లకు వర్తిస్తుందని పేర్కొంది. కనీస అవసరాలైన ఆహారం, బట్టలు, తాగునీరు కూడా సమకూర్చకుండా ప్రజలను ఇబ్బందులు పాల్జేస్తున్నఆ దేశ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో చాలా కుటుంబాలు ఆర్ధిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.