ఆఫ్ఘన్​లో పబ్​జీ, టిక్​టాక్​లపై బ్యాన్​

By udayam on September 20th / 12:45 pm IST

ఆఫ్ఘనిస్థాన్ లో కూడా పబ్​ జీ, టిక్​ టాక్​ పై బ్యాన్ విధించాలని తాలిబన్లు నిర్ణయించారు. మూడు నెలల్లో ఈ రెండు యాప్ లను తమ దేశంలో ఎవ్వరూ ఉపయోగించకుండా చేయనున్నారు. వీటి వల్ల తమ దేశ యువత తప్పుదోవ పట్టకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తాలిబన్లు చెబుతున్నారు. భద్రత, షరియా చట్ట అమలు సంస్థ సభ్యులతో దేశ టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ సమావేశం నిర్వహించిన తర్వాత 90 రోజులలో పబ్ జీ, టిక్‌టాక్ ను ఆఫ్ఘన్ లో నిషేధిస్తున్నట్టు ప్రకటన వెలువడింది.

ట్యాగ్స్​