తమిళ నటుడు ఇంద్రకుమార్​ ఆత్మహత్య

By udayam on February 20th / 12:20 pm IST

తమిళ టివి నటుడు, పలు యాడ్స్​లో నటించిన ఇంద్రకుమార్​ ఆత్మహత్య చేసుకున్నాడు.

తన స్నేహితులతో కలిసి ముందు రోజు రాత్రి సెకండ్​ షో సినిమాకు వెళ్ళి వచ్చి వారితో కలిసే పడుకున్నాడు. అయితే స్నేహితులు ఉదయం లేచేసరికి అతడు ఫ్యాన్​కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం గుర్తించి పోలీసులకు విషయం తెలిపారు.

దీంతో అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్​ మార్టమ్​ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శ్రీలంక తమిళుడైన ఇతడు చెన్నైలోని శరణార్ధుల క్యాంపులో ఉండేవాడు.

అతడికి భార్య, కొడుకు కూడా ఉన్నాడు. గత వారం బాలీవుడ్​ నటుడు సందీప్​ నహర్​ సైతం ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం మరవక ముందే సినీ ప్రియులకు మరో నటుడు దూరమయ్యాడన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నారు.

ట్యాగ్స్​
Source: msn