తమిళనాడులో తెలుగు నటి ఆత్మహత్య

By udayam on September 20th / 6:12 am IST

ఆంధ్రాలో పుట్టి తమిళనాడులో నటిగా మారిన దీప (అసలు పేరు పాలైన్​ జెస్సికా) ఆత్మహత్య చేసుకున్నారు. తుప్పరివాలన్​, వాయితా సినిమాలతో పేరు తెచ్చుకున్న ఈమె చెన్నైలోని తన అపార్ట్​మెంట్​లో సీలింగ్​ ఫ్యాన్​కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన వ్యక్తిగత డెయిరీలో ఆత్మహత్యకు గల కారణాలను ఆమె రాసినట్లు పోలీసులు తెలిపారు. ‘తనకు ఈ జీవితం ఇష్టం లేదని, ఎవరి నుంచీ ఆదరణ లేకుండా ఒంటరిగా బతకడం ఇష్టం లేకే ఈ పని చేస్తున్నట్లు’ ఆమె రాసిందని పోలీసులు తెలిపారు. మరో వైపు ప్రేమ వైఫల్యం కూడా ఈ మృతికి ఓ కారణంగా విచారణ జరుపుతున్నారు.

ట్యాగ్స్​