గుండెపోటుతో డైరెక్టర్​ కెవి ఆనంద్​ మృతి

By udayam on April 30th / 4:24 am IST

తెలుగు, తమిళ భాషల్లో పలు సూపర్​హిట్​ చిత్రాల్ని తెరకెక్కించిన డైరెక్టర్​, సినిమాటోగ్రాఫర్​ కెవి ఆనంద్​ ఈరోజు తెల్లవారుఝామున గుండెపోటుతో మరణించారు. ఇంట్లో ఉండగానే గుండె పోటు రావడంతో దగ్గర్లోని ఆసుపత్రికి ఆయనే స్వయంగా కారు నడుపుతూ వెళ్ళారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఆయన వయసు 54 సంవత్సరాలు. సూర్యతో ‘వీడొక్కడు’, జీవాతో ‘రంగం’ సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఉత్తమ సినిమాటోగ్రాఫర్​గా జాతీయ అవార్డుతో పాటు ఫిలింఫేర్​ అవార్డును సైతం అతడు దక్కించుకున్నాడు. సినిమాల్లోకి రాక ముందు ఆయన జర్నలిస్ట్​గా పనిచేశారు.

ట్యాగ్స్​