స్టాలిన్: సేతుసముద్రం ప్రాజెక్ట్‌‌ను వెంటనే చేపట్టండి

By udayam on January 12th / 10:17 am IST

వివాదాస్పద ‘సేతుసముద్రం’ ప్రాజెక్టు మీద తీర్మానాన్ని తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆ ప్రాజెక్ట్‌ను కేంద్రం కొనసాగించాలంటూ చెబుతున్న ఆ తీర్మానాన్ని తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. తమిళనాడు ఆర్థికాభివృద్ధి కోసం ఆ ప్రాజెక్ట్ ఎంతో అవసరం. 1860లో కమాండర్ టేలర్ రూ.50 లక్షలతో సేతుసముద్రం ప్రాజెక్టును ప్రతిపాదించారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి ఇందులో సాధ్యాసధ్యాలను పరిశీలించేందుకు కూడా అనుమతించారు. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే ఆ ప్రాజెక్ట్ చేపట్టాలి’ అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలీన్ కేంద్రాన్ని కోరారు.

ట్యాగ్స్​