వెంకన్నకు కానుకగా రూ.70 లక్షల ఇళ్ళు

By udayam on December 27th / 6:47 am IST

తమిళనాడుకు చెందిన ఓ భక్తురాలు తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం తిరుమల శ్రీవారికి రూ.70 లక్షల విలువైన ఆస్తిని విరాళంగా అందించింది. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా, కొడివలస గ్రామానికి చెందిన రిటైర్డ్ నర్సు ఎన్​.కె.నెమావతి ఇటీవల కొత్తగా నిర్మించిన రెండంతస్తుల భవనాన్ని వెంకటేశ్వర స్వామి కి ఇచ్చేశారు. ఈ ఇంటి విలువ రూ.70 లక్షలు. ఈ మేరకు తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలోని టిటిడి ఎస్టేట్ విభాగం ప్రత్యేకాధికారి మల్లికార్జునకు ఇంటి పత్రాలు, తాళాలను అందజేశారు.

ట్యాగ్స్​