ఆర్బీఐ: అత్యధిక ఫ్యాక్టరీలున్న రాష్ట్రంగా తమిళనాడు.. ఎపి ర్యాంక్​ ఎంతంటే?

By udayam on November 25th / 5:02 am IST

దేశంలో అత్యధిక కంపెనీలు ఉన్న రాష్ట్రంగా తమిళనాడు నిలిచిందని రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా తాజా నివేదికలో వెల్లడించింది. దేశం మొత్తం మీద ఉన్న ఫ్యాక్టరీలలో 15 శాతం కంపెనీలు ఒక్క తమిళనాడులోనే ఉన్నట్లు ఆర్బీఐ పేర్కొంది. 2020 లెక్కల ప్రకారం తమిళనాడులో మొత్తం 38,837 ఫ్యాక్టరీలు ఉంటే.. గుజరాత్​ లో 28,479 ఉంది. మూడో స్థానంలో మహారాష్ట్ర 25,610 ఫ/యాక్టరీలతో, ఆంధ్రప్రదేశ్​ 19,924 ఫ్యాక్టరీలతో నాలుగో స్థానంలోనూ కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్​ లో 19,184 ఫ్యాక్టరీలు ఉన్నాయి.

ట్యాగ్స్​