కూతురు కోసం తండ్రిగా మారిన తల్లి

By udayam on May 14th / 7:23 am IST

భర్త లేకుండా చిన్నారిని పెంచడం ఎంత కష్టమో ఈ తమిళనాడు మహిళను అడిగితే చెబుతుంది. పెళ్ళైన 15 రోజులకే భర్త గుండెపోటుతో మరణిస్తే పుట్టిన బిడ్డ కోసం తల్లి పెచ్చియమ్మల్​ ‘తండ్రి’గా మారింది. సమాజంలో తనను తక్కువ చేసి చూస్తున్నారన్న అవమానంతో ఆమె తన సంప్రదాయ కట్టు, బొట్టును పక్కన పెట్టి లుంగీ, షర్ట్​ వేసుకుంటూ రోజువారీ కూలిగా మారింది. దీంతో ఆమె అక్కడ అన్నాచి అనే పిలుస్తారు. 30 ఏళ్ళుగా ఆమె మగరాయుడుగానే క్రాఫ్​ చేయించుకుంటూ తన పేరును కూడా ముత్తూగా మార్చుకుంది.

ట్యాగ్స్​