3వ పెళ్ళి.. ఫేక్​ ప్రెగ్నెన్సీ.. ఆపై కిడ్నాప్​

By udayam on October 13th / 12:22 pm IST

భర్త ఆస్తిని కాజేయడానికి ఓ భార్య తాను కడుపుతో ఉన్నానని 9 నెలల పాటు నమ్మించింది. ఆపై పురిటినొప్పులు వస్తున్నాయని ఆసుపత్రికి వెళ్ళి అక్కడ ఓ చిన్నారిని కిడ్నాప్​ చేసి తనే మన బిడ్డ అని ఇంటికి తీసుకొచ్చేసింది. తమిళనాడులోని తంజావూరు జిల్లా ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేసి అసలు విషయాన్ని బయటపెట్టారు. ఈ 9 నెలల పాటు ఆమె తన కడుపుకు గుడ్డలు కట్టుకుని భర్తను మోసం చేసిందని, ఆమెకు ఇది 3వ పెళ్ళి అని కేసు వివరాల్ని తెలిపారు. ఇప్పటికే ఇద్దరిని పెళ్ళాడిన మహిళ వారి వద్ద కూడా దొరికినంత దోచుకుని మురుగేశన్​ అనే వ్యక్తిని ఏడాది క్రితం పెళ్ళాడిందని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్​