రాధే శ్యామ్​ డైరెక్టర్​ తో ధనుష్​ మూవీ

By udayam on December 21st / 12:15 pm IST

ప్రభాస్​, పూజాహెగ్డేలతో పాన్​ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్​’ ను తీసని డైరెక్టర్​ రాధాకృష్ణ.. ఇప్పుడు ధనుష్​ తో ఓ యాక్షన్​ మూవీని ప్లాన్​ చేస్తున్నాడు. ఇప్పటికే ధనుష్​ కు కథను వినిపించి సినిమాకు ఒప్పించిన ఈ యువ డైరెక్టర్​.. ఈ మూవీని కూడా యువీ క్రియేషన్స్​ బ్యానర్​ తోనే చేయనున్నాడు. కేవలం తెలుగు, తమిళం భాషల్లోనే ఈ మూవీని తెరకెక్కించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ధనుష్​ వరుసగా తెలుగు డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అతడు నటిస్తున్న ‘సార్​’ మూవీకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుంటే.. శేఖర్​ కమ్ముల దర్శకత్వంలోనూ ఓ మూవీని చేస్తున్నాడు ధనుష్​.

ట్యాగ్స్​