యాక్సిడెంట్​: తానా డైరెక్టర్ భార్య, ఇద్దరు కూతుళ్లు మృతి

By udayam on September 27th / 6:10 am IST

అమెరికా లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కృష్ణా జిల్లాకు చెందిన తానా బోర్డు డైరెక్టర్‌ డాక్టర్‌ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్‌ భార్య, ఇద్దరు కుమార్తెలు మరణించారు. కృష్ణా జిల్లా కురుమద్దాలికి చెందిన నాగేంద్ర శ్రీనివాస్ ఉన్నత విద్యను అభ్యసించేందుకు 1995లో అమెరికా వెళ్ళి అనంతరం అక్కడే డాక్టర్​గా స్థిరపడ్డారు. 2017 నుంచి ‘తానా’ బోర్డులో పనిచేస్తున్నారు. శ్రీనివాస్ భార్య వాణి ఆదివారం ఉదయం 11.30 గంటలకు కాలేజీ నుంచి కుమార్తెలను తీసుకొచ్చేందుకు కారులో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో టెక్సాస్ వాలర్ కౌంటీలో వారు ప్రయాణిస్తున్న కారును ఓ వ్యాను బలంగా ఢీకొట్టింది.

ట్యాగ్స్​